పురస్కార ప్రధానోత్సవం

విద్యార్ధులు తమను తాము విజేతలుగా భావించేలా చెయ్యడం శిక్షకుని పాత్రలో ఒక ముఖ్య భాగం. అంటే, మీరు ఎటువంటి ప్రవర్తన ఆమోదిస్తారో నిర్వచించి, ఆ ప్రవర్తన చూపిన వారికి బహుమతులు ఇవ్వాలి. వారంలో నేర్చుకున్న పాఠాలను, హోమ్ వర్క్ చెయ్యడం ద్వారా అమలు చేసిన విద్యార్ధులను బహుమతికి అర్హులుగా చెయ్యమని మా సిఫార్సు. తరగతులకు హాజరు కావడం మరియు కంఠస్థం చెయ్యటం అంటే శిక్షణ, అలాగే వారంలోఅప్పగించిన పనులు చెయ్యడం అంటే పోటీ. వారు విజయం సాధించాలంటే “శిక్షణ” చాలా ముఖ్యమని విద్యార్ధులను ప్రోత్సహించండి. నిజ జీవిత పోటీలో గెలుపే అసలైన గెలుపు కదా.

ఒక ఆలోచన ఏంటంటే, ప్రతీనెలాఖరున, అంటే ఎప్పుడు ప్రతీ ఆత్మ ఫలం యొక్క అధ్యయనం పూర్తి చేస్తారో, అప్పుడు అవార్డు ఉత్సవాలు నిర్వహించడం. ఉదాహరణకి, “ప్రేమ” గురించి ఐదు వారాలు అధ్యయనం చెయ్యాలి. కనీసం మూడు వారాలు అసైన్మెంట్స్ పూర్తి చేసినవారు “కంచు” పతకం, నాలుగు వారాలు పూర్తి చేసినవారు “వెండి” పతకం,ఐదు వారాలు పూర్తి చేసినవారు “బంగారు” పతకం గెలవచ్చు. మొదటి నెల గడచిన తర్వాత, ఏమి చేస్తే మీ విద్యార్ధులు పతకాలు గెలుస్తారో, దాన్ని మీరు సవరించవచ్చు, ఎందుకంటే కొన్ని గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాలలో, మిగిలిన వారి కన్నా ఎక్కువ సవాలు చేసే అసైన్మెంట్స్ ఇవ్వవలసిన అవసరం ఉంది . అలాగే ప్రచారానికి అనుకూలంగా ఉన్నా ప్రాంతాలలో, వారు ప్రోత్సాహకరంగా ఉండడానికి మరియు తరగతులలో కొనసాగడానికి, మీరు సులభమైన అసైన్మెంట్స్ ఇవ్వవలసిన అవసరం ఉంది.

ఏడాది పొడవునా చాలా పురస్కారాలు గెలుచుకున్నవారి కోసం, సంవత్సరం చివరిలో ఒక పెద్ద పురస్కారం ఇవ్వండి. ఇది ఒక పతకం గాని, విజయ చిహ్నం గాని కావచ్చు. ఈ పురస్కారాలను మరింత ప్రత్యేకంగా మార్చడానికి, చర్చిలో వేదికపై అందరి పెద్దల ముందు మీ విద్యార్ధులకు వీటిని ప్రదానం చెయ్యండి.

జెండా బ్యానర్ విజేతలువిజయ చిహ్నంపతకాలు