శిక్షకులు

మీ కోసం మా దగ్గర ఒక ఊహించని బహుమతి ఉంది. మీరు అనుకోవచ్చు ఆదివారం స్కూలు, టీచరుగా సంతకం చేయాలని . కాని ఇప్పుడు మీ స్థానం ఒక శిక్షకునిలా మారింది. ఇది నిజం, మేము ఈ సంవత్సరం బైబిల్ ని పఠనం చేస్తున్నాము. బాక్సింగ్ అనే అంశం తో మరియు మేము ఆశిస్తున్నాము ఆటలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయని. ప్రియమైన గురువు, ఇప్పుడు మొదలు! గురువుకు బదులుగా ఒక కోచ్గా ఉండండి. మిమ్మల్ని అది ప్రేరేపిస్తుంది మీ తరగతి లో ప్రతి విద్యార్థి గురించి లోతుగా శ్రద్ద తీస్కొట్టానికి మరియు వారు ఒక ఛాంపియన్ గా మారేందుకు వారి పురోగతిని

చిన్న సమూహాలు

మూడు నుండి ఏడుగురు పిల్లలు ఉన్న చిన్న సమూహాలను తయారు చేయండి. ప్రతి చిన్న సమూహానికి ఒక శిక్షకుని అవసరం ఉంటుంది. శిక్షకులు ప్రతి వారం తరగతికి రావలసిన అవసరం లేదు, కానీ ప్రతి వారం వారి విద్యార్థులు లేదా 'అథ్లెట్'లతో తనిఖీ చెయ్యాలి. మీ ప్రధాన నాయకుడిని, నిర్వహణ మరియు ఇతర శిక్షకులకు స్ఫూర్తినిచ్చేందుకు, ప్రధాన శిక్షకుడిగా కేటాయించండి.

మీ విద్యార్థులు వారం మొత్తంలో వాస్తవంగా అసైన్మెంట్స్ చెయ్యటంలో సాయం చెయ్యటానికి, మీ తరగతిని చిన్న సమూహాలుగా విడగొట్టండి. ఎక్కువ సoడే పాఠశాల కార్యక్రమాలు చర్చి వద్ద ఉంటాయి మరియు వారం మొత్తం హోంవర్క్ అవసరం లేదు. అయితే, మీ విద్యార్థులు నేర్చుకోవటం ద్వారా వారి జీవితాలలో నుంచి పాపాన్ని తొలగించలేరు. వారు నిజానికి 'రింగ్ లోకి' వఛ్చి, వారంలో ఎదుర్కొనే వాస్తవ పాపంపై పోరాడాలి. నిజాయితీగా, ఎవరైనా వారిపై తనిఖీ చెయ్యకుండా, ఇది జరగటం దాదాపు అసాధ్యం. దయచేసి విద్యార్థులు వారు చేసిన ఒక కార్యం గురించి చెప్పినప్పుడు వారి మాటలు నమ్మకండి మరియు అంగీకరించకండి. ఈ కార్యక్రమం గురించి మీరు నిర్లక్ష్యం వహిస్తే, మీ విద్యార్థులను అబధ్ధాలు చెప్పటానికి మీరు శిక్షణనిచ్చినట్లే. అయితే, నాతో పాటు మీరు ఊహించండి, మీరు మీ విద్యార్థులకు శిక్షణనివ్వగలరు, మరియు వారు హోంవర్క్ చేస్తున్నారో లేదో చూడగలరు, వారి జీవితాలలో నిజమైన మార్పు చూడగలరు. కేవలం ఒక సంవత్సరంలో, మీరు వారి జీవితాలను మార్చవచ్చు. మీ విద్యార్థులు, ఆత్మ యొక్క ఫలాన్ని గుర్తుంచుకోవడమే కాదు, కానీ నిజానికి జీవించడం నేర్చుకుంటారు.

ఈ చిన్న సమూహాలను సులభతరం చెయ్యటం కోసం, మేము మీ శిక్షకుల కోసం ఒక హ్యాండ్ ఔట్ ను మరియు మీ హెడ్ కోచ్ కోసం ఒక చిన్న పుస్తకాన్ని తయారుచేశాము. శిక్షకుల హ్యాండ్ ఔట్స్ ప్రతులు ఒకొక్క నెలవారీగా మరియు ప్రతి ఆత్మ ఫలానికి ఉన్నాయి. హెడ్ కోచ్ పూర్తి మూడు నెలల కోసం కేటాయింపులు కల చిన్న పుస్తకాన్ని కలిగి ఉన్నాడు.

 కోచ్ చేతి ప్రతులు ఛాంపియన్స్
కోచ్ చేతి ప్రతులు ఛాంపియన్స్ 1

Only available as a download.

యూనిట్ 1: ప్రేమ, ఆనందం మరియు శాంతి

కోచ్లకు బాధ్యతలు

కోచ్:

  • మూడు నుంచి ఐదుగురు పిల్లలకు శిక్షణనివ్వండి
  • ప్రతి వారం అసైన్మెంట్స్ ను చర్చించటానికి మరియు విజేతగా మారటాన్ని ప్రోత్సహించటానికి తరగతి ముందు, తరగతి తరువాత ఐదు నిమిషాలు విద్యార్థులను కలవండి.
  • అసైన్మెంట్ గురించి గుర్తుచెయ్యటానికి విద్యారులకు కాల్ / టెక్స్ట్ చెయ్యండి. (సూచన = మంగళవారం)
  • పూర్తి చేసిన అసైన్మెంట్ గురించి నివేదిక పొందుటకు, వారంలో విద్యార్థులకు రెండవ సారి కాల్ / టెక్స్ట్ చెయ్యండి. (సూచన = శుక్రవారం)
  • చిన్న సమూహంలో పిల్లల కోసం పూర్తి చేసిన అసైన్మెంట్ లను కనిపెట్టండి మరియు ప్రతివారం ప్రధాన శిక్షకుడికి రిపోర్ట్ చెయ్యండి.

హెడ్ కోచ్:

  • అసైన్మెంట్ గురించి చర్చించటానికి, వారి విద్యార్థులకు విశ్వసనీయంగా శిక్షణనివ్వటాన్ని ప్రోత్సహించటానికి, ప్రతి వారం శిక్షకులను ఐదు నిమిషాలు తరగతికి ముందు కలవండి.
  • అసైన్మెంట్ గురించి గుర్తు చెయ్యటానికి, ప్రతి వారం శిక్షకులకు కాల్ / టెక్స్ట్ చెయ్యండి. (సూచన = మంగళవారం)
  • వారంలో రెండవసారి పూర్తి చేసిన అసైన్మెంట్ల నివేదిక పొందుట కోసం శిక్షకులకి కాల్ / టెక్స్ట్ చెయ్యండి. (సూచన = శుక్రవారం)
  • అందరూ విద్యార్థుల కోసం చేసిన అసైన్మెంట్లను కంట కనిపెట్టండి.
  • శిక్షకులు మరియు వారి కుటుంబాలకు ప్రతి నెలా ప్రేరణా సమావేశాలు ఏర్పాటు చెయ్యండి.

నియామకాలు

అన్ని చిన్న గ్రూపులకు తగినంతమంది శిక్షకులను కలిగి ఉండటం కోసం మరింతమంది నాయకులను నియమించటం ఒక సవాలే. అయితే, ఇది అంత కష్టంగా ఉండవలసిన అవసరం లేదు. శిక్షకులను సులభంగా కనుగొనటానికి ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

  • శిక్షకులను ఒక నెల మాత్రమే పని చెయ్యమని అడగండి. ప్రతి నెల ఒక ఆత్మ ఫలాన్ని కవర్ చేస్తుంది. పెద్దలను వారి నిబద్ధత గురించి అడిగేటప్పుడు, మీరు ఒక నెలకు మాత్రమే అడిగితే, చాలా మంది చేరటానికి ఇష్టపడతారు. ఒక నెల తరువాత, సులభంగా, సరదాగా ఉంటే, వారు మళ్ళీ చేరాలని అనుకుంటారు.
  • శిక్షకులను సాధారణంగా చర్చికి వెళ్ళటానికి అనుమతించండి, కానీ విద్యార్థులను కలవడానికి పదినిమిషాల ముందు రమ్మనండి. మీ శిక్షకులు ఆదివారం పాఠశాల తరగతికి నెలలో ఒకసారి మాత్రమే హాజరు కాగలరు, మరియు ఇతర వరాలు, పెద్దలతో కలిసి మామూలుగా చర్చికి వెళ్తారు.
  • కాల్ చెయ్యటానికి బదులుగా విద్యార్థులకు టెక్స్ట్ చెయ్యండి. విద్యార్థులతో తేలికగా సంభాషించటానికి వీలుగా, ఆటోమాటిక్ టెక్ట్స్ సెట్ చెయ్యటానికి, శిక్షకులకు సహాయం చెయ్యండి. సంప్రదాయ కాలింగ్ కు బదులుగా మీరు ఫేసుబుక్ అకౌంట్స్, ట్విట్టర్, వాట్సాప్ మొదలైనవి ఉపయోగించవచ్చని మరచిపోకండి.
  • కొన్ని వస్తువులను నిల్వ చెయ్యటానికి, శిక్షకులకి చర్చి వద్ద చోటు సృష్టించండి. మీ శిక్షకులు 'స్పోర్టి' గా కనిపించటం కోసం, స్పోర్ట్ కాప్స్ లేదా ఈలలు మరియు నీటి సీసాలను ధరిస్తారు. ప్రతి వారం ఈ వస్తువులను తెచ్చుకోవటానికి బదులుగా, వీటిని చర్చలో ఉంచడానికి అనుమతించండి. ఈ విధంగా మీ శిక్షకులు వారి సాధారణ చర్చి బట్టలు ధరిస్తారు, మరియు శిక్షకులలా కనిపించటానికి కొన్ని స్పోర్ట్ వస్తువులను ధరిస్తారు.
  • నెలవారీ సమావేశాలను అదనపు ప్రేరణ కలిగించే విధంగా చెయ్యండి, అందువలన వారు సంవత్సరం గడిచే కొద్దీ, కార్యక్రమంలో పాల్గొనటాన్ని కొనసాగిస్తారు.
  • అవసరమైతే పెద్ద సమూహాలను అనుమతించండి. (ఫేసుబుక్ గ్రూప్ నోటిఫికేషన్స్ సహాయంతో, పదిమంది విద్యార్థులకు శిక్షణనివ్వటం అంత కష్టం కాదు.)

ప్రేరణా సమావేశాలు

హెడ్ కోచ్ ముఖ్య బాధ్యత శిక్షకులను చైతన్యంగా ఉంచటం. దీనికి ఒక ముఖ్యమైన మార్గం నెలవారీ ప్రేరణా సమావేశాలు నిర్వహించటం. మీరు భోజనం అందించగలరు, కలిసి ప్రార్థించగలరు, స్పోర్ట్స్ డేటా చూసి అది క్రిస్టియన్ జీవితాల్లో ఎలా వర్తింపచెయ్యాలో చూడగలరు. అదనంగా, చేతిలో పాప్ కార్న్ లేదా ఇతర రుచికరమైన పదార్ధాలతో, ఒలింపిక్ క్రీడాకారులను లేదా ఒక ప్రేరణనిచ్చే క్రీడల చిత్రాన్ని చూడగలరు. అథ్లెట్స్ కష్టపడటానికి విలువ ఉంటే, ఆధ్యాత్మిక మరియు శాశ్వత లాభం కోసం మనం కష్టపడటం అంతకంటే విలువైనది కాదా అనే ఆలోచనను మీ శిక్షకులతో చర్చించండి.