సిబిఐ: పిల్లల బైబిల్ దర్యాప్తు

మీ చర్చి, ప్రాంతము లేదా సంఘములో మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగే మరొక పూర్తి సంవత్సరం ఆదివారం పాఠశాల తరగతులు, లేదా వారపు బైబిల్ శిక్షణ మీకు ఇస్తున్నందుకు మేము “పిల్లలే ప్రముఖులు” వద్ద చాలా ఆనందంగా ఉన్నాము. ఈ కార్యక్రమములో, మీ పిల్లలు వారు ప్రత్యేక ఏజెంట్లు లేదా గూఢచారులుగా ఊహించుకుంటారు మరియు ప్రతి వారము పరిష్కరించటానికి వారికి ఒక కేసు ఇవ్వబడుతుంది. “సిఎస్ఐ” లేదా “క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్” టివి కార్యక్రమంలోలాగా మీ విద్యార్ధులు ప్రతి కేసు పరిష్కరించే సమయంలో ప్రయోగాలు చేసే మరియు ఫోటోలు తీసే సైన్సు టెక్నిషియన్లు మరియు పోలీస్ డిటెక్టివ్లు. మీ సృజనాత్మకతను ఉపయోగించి మీ చర్చి తరగతిని సైన్సు ప్రయోగశాలలా అలంకరించండి, మరియు మీ ఉపాధ్యాయులకు సైన్సు టెక్నిషియన్లు మరియు పోలీస్ గూఢచారులుగా వేషం వేయండి.