విశ్వాసపు వీరులు - యూనిట్ 1

విశ్వాసపు వీరుల ఆదివారపు బడికి (హీరోస్ ఆఫ్ ఫేయిత్ సండే స్కూల్) స్వాగతం! హెబ్రీయులకు 11లో చెప్పబడిన విశ్వాసపు వీరులని మనకి చూడబోతున్నాము. మన శారీరక జీవితం కంటే మన ఆత్మీయ జీవితం ముఖ్యమైనది కాబట్టి, మనం ఒక విశ్వాసపు జీవితాన్ని ఎలా పొందాలో నేర్చుకోబోతున్నాము. జీవితంలోని సాధారణ నిర్ణయాల కంటే ఆత్మీయ నిర్ణయాలు ఎందుకు ముఖ్యమైనవో మనము పరిశీలించబోతున్నాము. దేవుని యందు విశ్వాసము ఉంచిన, దేవునితో మాట్లాడిన, మరియు దేవుని కొరకు జీవించిన పురుషులు మరియు స్త్రీల యొక్క జీవితాలను మనం పరిశీలించే సమయంలో ఈ ప్రశ్నలకు మనం ప్రతిస్పందించబోతున్నాము. వారు మన కొరకు ఒక ఉదాహరణ. కొన్ని సార్లు మనుషులు చేసే మంచి పనులు మనం చూస్తాము, ఇంకొన్ని సార్లు మనం వారు చేసే తప్పుల నుండి ఏంతో నేర్చుకుంటాము.

మేము ఈ తరగతులను చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్ద పిల్లల వరకూ బోధిస్తున్నప్పటికీ, పాత నిబంధనలోని కొన్ని వినోదపూరిత విషయాలను వాళ్లతో పాటు మీరు కూడా నేర్చుకోవడంలో వున్న అందాన్ని చవిచూస్తారు. అన్నింటికీ మించి, ఈ సూత్రాలను మన రోజువారి జీవితాలకి ఏ విధంగా వర్తింపజేయాలో తెలియజెప్పే వినూత్న ఆలోచలనలని చూడడం కూడా ఒక అద్భుతమైన విషయమని చెప్పవచ్చు. ఈ మొత్తం మెటీరియల్‌ని రాసే సమయంలో కూడా దేవుని గురించి మరియు క్రైస్తవ జీవితం గురించి నేర్చుకోవడంలో ఎంతో వినోదాన్ని పొందాము.