మా గురించి

పిల్లలే ప్రముఖులు లోగో మేము ఎవరంటే!

సమావేశాలు మరియు శిక్షణ సామాగ్రి''పిల్లలే ప్రముఖులు'' అనునది వర్గాలకు మరియు సంఘ సంస్థలన్నిటికి అనుబంధముగా 2015వ సంవత్సరమునందు స్థాపించబడింది. మా దృష్టి అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలల సంఘాలపై, వారికి అవసరమైన వనరులను అందించడం పైనే ఉంటుంది.

ఇతర సంస్థలతో మాకు రెండు విభిన్నతలు ఉన్నాయి. మొదటిది, మా సమాచారమునంతటిని ఉచితముగా డౌన్‌లోడ్‌ చేసికొనుటకు ఆన్‌లైన్‌లో (అంతర్జాలములో) పెట్టాము. మేము ముద్రించిన వనరులను నిర్ణీత ధర చెల్లించి కొనాల్సి ఉంటుంది, అయితే వాటిని జిరాక్స్‌ చేసుకొనడంపై మేము ఎలాంటి ఆంక్షలు విధించ లేదు. రెండవది, మరలా మరలా అదే సమాచారమును మేము పునరావృతము చేయము, ప్రతీ సంవత్సరము క్రొత్త సండే స్కూలు మరియు విబిఎస్‌ పాఠ్య ప్రణాళికలను తయారు చేస్తాము.

మెక్సితో నగరానికి ఒక గంట దూరంలో మా కార్యాలయం ఉంది. గడిచిన పది సంవత్సరములలో, ''లాస్‌ నినోస్‌ క్యూంటన్‌'' అనే సంఘం పేరుతో ల్యాటిన్‌ అమెరికా కొరకు స్పానిష్‌ భాషలో వనరులను తయారు చేస్తున్నాము. 2014వ సంవత్సరములో, ఆంగ్ల భాషలో ప్రపంచంలో చాలా భాగాన్ని చేరుకోవాలని తలపెట్టాము.  2015వ సంవత్సరములో, మా దగ్గరనున్న వనరులను పోర్చుగీస్‌, హింది, తెలుగు, కన్నడ, మలయాళం మరియు మరాఠి భాషలలోనికి తర్జుమా చేయడం మొదలుపెట్టాము. ప్రస్తుతము మా దగ్గర 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది కార్యాలయములోను, మరికొంతమంది కార్యాలయపు వెలుపల పనిచేయుచున్నారు. సమాచారమును సిద్ధపరచుటలోను, అనువాదము చేయుటలోను, వాటిని ముద్రించే పనిలోను మరియు వాటిని అమ్మే పనిలోను నిమగ్నమైయున్నారు. మేమంతా మీకు సహాయం చేయడానికి పనిచేస్తున్న దేవుని యొక్క సహోదరీ సహోదరులం.

జీవితాలను మార్చుటకు మీరిక్కడ ఉన్నారు; మీకు సహాయం చేయుటకు మేమిక్కడ ఉన్నాము.

సంప్రదించు చిరునామా :

ఒటుంబా, మెక్సికో రాష్ట్రం ( న్యూ మెక్సికో సిటీ)
దేశం కోడ్: (52)

592-924-9041
info@childrenareimportant.com

మా ముద్రణ షాప్మా సంఘం :  (Our Ministry )

ప్రపంచ వ్యాప్తముగా అనేక సంఘములకు సరిపడా వనరులు లేకున్నప్పటికీ భవిష్యత్‌ తరాలను చేరుకోవడానికి పని చేస్తున్నాయి. వెబ్‌సైట్‌లో మేముంచిన సమాచారమంతయు ఉచితముగా డౌన్‌లోడ్‌ చేసికొనవచ్చును, జిరాక్స్‌ కూడ చేసుకొనవచ్చును మరియు వాటిని ఉచితంగా పంచవచ్చు. అవును, మీరు చదివింది నిజమే – ఇది పూర్తిగా ఉచితం!

ప్రతి సంవత్సరము మేము క్రొత్త  అంశములను వ్రాసి వాటిని ముద్రిస్తూ ఉంటాము. కాబట్టి, రేపటి గురించి మీరు ఆందోళన చెందకుండా, మా దగ్గర ఇవాళ అందుబాటులో ఉన్నదంతా మీరు ఉపయోగించుకోవచ్చు. సరికొత్త వనరులు వచ్చే ఏడాదికి అందుబాటోలు ఉంటాయి కూడా! మేము ఆసక్తికరమైన డిజైన్లను, సులువుగా ముంద్రించుకోగలిగే పద్ధతిలో అందిస్తాము. మీరు ప్రతీ వారమూ పాఠాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ప్రతీ సండే స్కూల్ పాఠ్యాంశం 13 వారాల యూనిట్లుగా ఉంటుంది. మీరు మీ వయస్సు గ్రూపుకు తగ్గ బోధకుల పుస్తకాన్ని, విద్యార్థుల పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ముద్రించుకోవచ్చు, దీనివల్ల మీరు వచ్చే మూడు నెలల తరగతులకు సంబంధించిన సమాచారంతో ఉంటారు.

ప్రస్తుతం మా వెబ్‌సైట్‌ను ప్రతీ రోజు 1000 మంది ప్రత్యేక సందర్శకులు దర్శిస్తున్నారు, 28 విభిన్న దేశాల నుంచి సగటున 10 గిగాబైట్ల సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అంటే రోజుకు సగటున 700 పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారన్నమాట! ఈ సంఖ్యల ఆధారంగా, మనం అంచనా వేస్తే గత ఏడాది, 15 లక్షల మంది పిల్లలు మా వీబీఎస్‌ మరియు సండే స్కూల్ వనరుల ద్వారా దేవుని గురించి నేర్చుకున్నారు. దేవునికి స్త్రోత్రము!

అవసరం చాలా ఎక్కువగా ఉండడం మరియు ముద్రణ ఖర్చులు భరించలేనంతగా ఉండడం వల్ల, మేము మెక్సికోలోనే ఓ ముద్రణాలయాన్ని నిర్వహిస్తున్నారు. నిర్ణీత ధరకు మేము స్పానిష్‌లో ముద్రించిన పుస్తకాలను విక్రయిస్తున్నాము. మేము ఇక్కడ ఉన్నది ఆదాయం కోసం కాదు, కానీ భవిష్యత్‌ తరాన్ని యేసుక్రీస్తు కోసం గెలుచుకోవడానికి. 2014లో, మేము 13 విభిన్న వర్గాలకు చెందిన 2500 చర్చిలకు, పుస్తకాలను, 1,50,000 మంది పిల్లలకు పుస్తకాలను ముద్రించి సరఫరా చేశాము. మేము త్వరలోనే భారతదేశంలోనూ ముద్రణ ప్రారంభించగలమని భావిస్తున్నాం.

మా స్వప్నంలో రెండో భాగం శిక్షణ, స్వప్నం, బోధకులకు ప్రయోగాత్మక చిట్కాలు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులను ప్రోత్సహించడం, స్ఫూర్తినందించడం, మరియు వారికి అవసరమైన వనరులను అందించి, తమ చుట్టూ ఉన్న బాలల సంఘాలపై దృష్టి పెట్టేలా చేయడమే మా కర్తవ్యం. మేము దీన్ని వదలకుండా కొన్నేళ్లుగా మీకు సహాయం చేయాలనుకుంటున్నాం. సండే స్కూల్‌ను బోధించడం లేదా అల్పాహార కార్యక్రమాన్ని కొనసాగించడం లేదా బాలల సంఘానికి అవసరమైన వనరులను కొనుగోలు చేయడానికి నిధులను సేకరించడం ఎంత కష్టమన్నది మాకు తెలుసు. దీన్ని విరమించాలనుకోవడం చాలా తేలిక, కానీ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా పనిచేయడంలో ఓ ఉత్సాహం ఉంటుంది. ప్రోత్సాహకర కథనాలతో, శిక్షణాత్మకమైన వీడియోలతో, లైవ్ కాన్ఫరెన్స్‌లతో మేము దీన్ని చేస్తాము. ఈ సమయంలో, మా శిక్షణా వనరులన్నీ స్పానిష్ భాషలో ఉన్నాయి, కానీ భారత దేశం కోసం త్వరలోనే మేం తయారు చేయడం మొదలుపెడతాం.

మీరు ఇక్కడ ప్రోత్సాహాన్ని మరియు వనరులను పొందారని మేం భావిస్తున్నాం. పిల్లలే ప్రముఖులకు స్వాగతం!