మమ్మల్ని సంప్రదించండి.పిల్లలే ప్రముఖులు లోగో

మేము మీ స్పందనను తెలుసుకోవాలనుకుంటున్నాం! మీ బాలల సంఘాన్ని మీరు నిర్వహించడానికి అవసరమైన సలహాలు మరియు పాఠ్యాంశాలను అందించాలన్నదే మా లక్ష్యం. మా వనరులన్నీ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, ఉచితంగా ప్రింట్ చేసుకోవచ్చు, మరియు ఉచితంగా ఇతర చర్చిలకు మరియు సంఘాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచిపెట్టుకోవచ్చు.

info@childrenareimportant.com

 

భారత దేశము

ఈ ఏడాది భారతదేశంలో మా కార్యకలాపాలు ప్రారంభించడానికి, మరియు వీబీఎస్ మరియు సండే స్కూల్ వనరులను చాలా భారతీయ భాషల్లో అందించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. మా మొదటి వీబీఎస్ “గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌” ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంచగలమని భావిస్తున్నాం. మేము సండే స్కూల్ వనరులను కూడా ఈ భాషల్లోకి అనువదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

మీకు మాతో కలిసి పనిచేయాలన్న ఆసక్తి ఉంటే, లేదా మీకు మరింత సమాచారం కావాల్సి ఉన్నా ఈ క్రిందివాటి ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

www.childrenareimportant.com

info@childrenareimportant.com

 

పంపిణీదారు అవ్వండి:

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలల సంఘాలకు అందుబాటు ధరకే వనరులను అందించాలన్నది మా స్వప్నం. మేము మొదట్లో మా వనరులన్నింటినీ ఉచితంగానే అందించాం కానీ రెండేళ్ల తర్వాత, చాలా వనరులను ఇలా ఉచితంగా అందించలేని పరిస్థితికి చేరుకున్నాం. ఇప్పుడు మేం మా వనరులను ముద్రణ, మరియు రవాణా ఛార్జీలకు అయ్యే ధరకే అమ్ముతున్నాం. మీ ప్రాంతంలోని బాలల సంఘాలకు తక్కువ ధరకే వనరులను అందించాలన్న ఆసక్తి మీకు ఉండి, పంపిణీదారుగా మారి మాతో కలిసి పనిచేయాలనుకుంటే మేం సంతోషంగా సహాయం చేస్తాం. వనరులను పంచిపెట్టడం కోసం మీరు మా అనుమతులు కోరాల్సిన అవసరం లేదు, కానీ మేము మీకు పరిమితితో కూడిన ఆర్థికేతర సహాయాన్ని మాత్రం అందించగలం.

www.childrenareimportant.com

info@childrenareimportant.com

 

లాటిన్ అమెరికా :

మేము మెక్సికో నుంచి పనిచేస్తున్నాం మరియు స్పానిష్ భాషలో 2005 నుంచి వనరులను తయారు చేస్తున్నాం. మా ప్రధాన కార్యాలయం మెక్సికో నగరానికి సమీపంలో ఉంది:

011-52-800-839-1009 or 011-52-592-924-9041 pedidos@losninoscuentan.com

మెక్సికో, కొలంబియా, అర్జెంటీనా, పెరు, వెనుజులా, చిలీ, గ్వాటెమాలా, ఈక్వెడార్, క్యూబా, బొలీవియా, డోమినికల్ రిపబ్లిక్, హోండూరస్, పరాగ్వే, నికరగ్వా, ఎల్ సాల్వడర్, కోస్టారికా, పనామా, ప్యూర్టో రికా, స్పెయిన్ మరియు ఉరుగ్వే దేశాలకు వనరులను అందించగలిగినందుకు మేము దేవునికి స్తోత్రము చెప్పుకుంటున్నాం!

చాలా చర్చిలు పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకుని వాటంతట అవే ముద్రించుకున్నాయి, కానీ మాకు మెక్సికోలో పుస్తకాలను అందించడం కోసం మెక్సికోలోనే ఓ ముద్రణాలయం కూడా ఉంది, దీంతో పాటు గ్వాటెమాలా మరియు వెనుజులాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు పంపిణీదారులూ ఉన్నారు. ఒక్కోసారి, మా ప్రధాన ముద్రణాలయం నుంచే ఇతర దేశాలకూ వనరులను పంపిణీ చేస్తాం.

గ్వాటెమాల: 5929-2602 pedidosguate@losninoscuentan.com