సుస్వాగతం!

ప్రియ సహోదరి మరియు సహోదరులారా, దేవునికి, మనకి పిల్లలు ఎంతో ప్రాముఖ్యమైనవాళ్లు. దేవుని కోసం మీరు వారిని చేరుకోవడానికి సహాయం చేయడమే మా కర్తవ్యం. మా విధానం ఏమిటంటే, కొత్త సండే స్కూల్ మరియు వెకేషన్ బైబిల్ స్కూల్‌ను ప్రతీ ఏటా సృష్టించడం, వాటిని వివిధ భాషల్లోకి అనువదించడం ద్వారా పిల్లలందరూ క్రీస్తు యొక్క సువార్తను వినగలిగేలా చేయడం.

బాలల సంఘాలు తరచూ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, నిధులు కూడా తక్కువగా కేటాయించబడుతున్నాయి, మరియు క్రైస్తవ సంఘాల్లో అత్యధిక టర్నోవర్‌ రేటు ఉన్నవీ బాలల సంఘాల్లో ఉన్నవి. అయినప్పటికీ, లక్షలాది మంది పిల్లలు  యేసు క్రీస్తు గురించి వినాల్సిన అవసరం ఇంకా ఉంది.

అందుకనే, వాస్తవికమైన,  సంపూర్ణమైన, నమ్మకమైన సండే స్కూలు మరియు వెకేషన్‌ బైబిల్‌ స్కూల్‌ పాఠ్య ప్రణాళికలను, తర్శీదు వనరులను మరియు పిల్లల సంఘాల కోసం అవసరమైన ఇతర వనరులను తయారు చేయడానికి మేము మా సమయాన్నంతటిని వెచ్చించాము.

పిల్లలే ప్రముఖులు లోగో మేము వీటినన్నిటిని చేయుటకుగల కారణమేమిటంటే

పిల్లలే ప్రముఖులు

అని మేము నమ్ముచున్నాము.

మా సమాచారమంతయు ఇంటర్నెట్‌నుండి డౌన్‌లోడ్‌ చేసుకొనుటకు, ఉపయోగించుకొనుటకు, ముద్రించుటకు ఉచిత అనుమతి ఇవ్వబడింది. మరియు ఎటువంటి అభ్యంతరములు లేకుండా ఇతర చర్చిలకు మరియు సంఘములన్నిటికి ఉచితంగా పంచిపెట్టుకోవచ్చు.

మా చిరునామా

We are located 1 hour outside of Mexico City, Mexico.
01-592-924-9041
info@childrenareimportant.com