ఇన్ థా రింగ్

మీ విద్యార్ధులు ఎప్పుడైతే బయట ప్రపంచంలో కాలు పెట్టారో, వాళ్ళు నిజానికి“బరిలో ”ఉన్నట్టు! ఇక్కడే వారు తమ పాపపు కోరికలకు వ్యతిరేకంగా పోరాడుతారు. అందుకే, వారి ఇళ్లు మరియు పాఠశాలలే వారి యొక్క అసలు పోటీలు మరియు బాక్సింగ్ పోటీలు. ఎందుకంటే, మనమందరం చర్చిలో సరైన సమాధానాలు ఇవ్వడంలో, నటించడంలో మంచిగా ఉంటాం. ఏ బిడ్డ కూడా తను చర్చిలో కంఠస్థం చెయ్యడం ద్వారా లేదా నేర్చుకోవడం ద్వారా గెలిచానని అనుకోకుండా చూడండి. అది శిక్షణ. వారి జీవితంలోనే అసలైన పోరాటం ఉంది. వారంలో, నేర్చుకున్న పాఠాలు అనుసరిస్తే, వారు పోటీలు గెలవగలరు.

వారాంతపు అసైన్మెంట్లు

గత వారం ఇచ్చిన హోమ్ వర్క్ అసైన్మెంట్లు గురించి చర్చించండి మరియు వచ్చే వారం చెయ్యవలసిన అసైన్మెంట్లు మీ విద్యార్ధులకు ఇవ్వండి. అవి విద్యార్ధుల పుస్తకాలలో మరియు మ్యాచ్ కార్డులలో ఉంటాయి. ఎవరైతే అసైన్మెంట్లు చేస్తారో వారే విజేతలు కాగలరని మీ విద్యార్ధులకు గుర్తు చెయ్యండి. నేర్చుకున్నదాన్ని జీవించడం తప్ప, చర్చికి వెళ్ళడం లేదా బైబిల్ కంఠస్థం చెయ్యడం వల్ల మనం ఎవ్వరమూ విజేతలు కాలేము. విద్యార్ధులు తమ అసైన్మెంట్లు ట్రాక్ చెయ్యడానికి సహాయం కోసం మీరు శిక్షకులతో కూడినచిన్న సమూహాలను సృష్టించమని మా సిఫార్సు. ("శిక్షకులు" పేజీలో మరింత సమాచారాన్ని చూడండి. )
బాక్సింగ్ లో ఎలాగైతే ఒక్క పిడిగుద్దుతో ప్రత్యర్థిని మట్టి కరిపించలేమో, అలాగేవారానికి ఒక్కసారి హోమ్ వర్క్ చేస్తే, పాపం ప్రక్షాళనం కాదు. నిజంగా విజేతలు అవ్వాలంటే, వారంలో మరిన్ని పిడిగుద్దులు కురిపించాలని విద్యార్ధులకు చూపించడానికి ఈ పోలిక బాగా ఉపయోగపడుతుంది. విద్యార్ధులు వారంలో ఎన్ని “పిడిగుద్దులు” సాధించారో ట్రాక్ చెయ్యడానికి మరియు పోటీని ప్రోత్సహించడం కోసం, మీ శిక్షకులను వినియోగించండి. ప్రతీ “పిడి గుద్దు” వారంలో వారు చేసిన అసైన్మెంట్ కు ఉదాహరణ. పిడిగుద్దులను మరింత సరదాగా చెయ్యడానికి, ఈ నాలుగు రకాల పిడిగుద్దులు వాడండి: జబ్, హుక్, క్రాస్ మరియు అప్పర్ కట్.  

మ్యాచ్ కార్డులు

వారం యొక్క మ్యాచ్ పోరాటాన్ని ఒక కార్డుగా ఉంచి, దాన్నిహాజరు బహుమతిగా ఇవ్వండి. అన్ని కార్డులు సేకరించడానికి విద్యార్ధులను సంవత్సరం అంతా హాజరు కమ్మని ప్రోత్సహించండి!

 

మ్యాచ్ కార్డులు  2
మ్యాచ్ కార్డులు 2 - త్వరలో వస్తున్నాయి!

Only available as a download.

ప్రతీ వారం ఈ మ్యాచ్ కార్డులు సేకరించడాన్ని పిల్లలు ప్రేమిస్తారు ! ప్రతీ కార్డు వెనుక ఇచ్చిన హోమ్ వర్క్ ఉంటుంది.

 

మ్యాచ్ కార్డులు  3
మ్యాచ్ కార్డులు 3 - త్వరలో వస్తున్నాయి!

Only available as a download.

ప్రతీ వారం ఈ మ్యాచ్ కార్డులు సేకరించడాన్ని పిల్లలు ప్రేమిస్తారు ! ప్రతీ కార్డు వెనుక ఇచ్చిన హోమ్ వర్క్ ఉంటుంది.