తరగతి షెడ్యూల్-ప్రణాళిక

సంగీతం

మీ తరగతినీ కొత్త పాటలు పాడటం తో ప్రారంబించండి. మరియు ప్రతి ఒక్కరూ లీనమైపోయెలా చర్యలతో కదిలించండి. మా వెబ్సైట్ నుండి పాటలు డౌన్లోడ్ చేసుకోండి, మరియు చర్యలు లేదా కొరియోగ్రఫీ వీడియోలను చూపిన తెలుసుకొండి.

నాటకము

ప్రతి వారం ఒక ఆహ్లాదకరమైన నాటకము కోసం, ఇద్దరు నటులు చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులను ఎంచుకోండి: వైజ్ విల్లీ మరియు ఫులిష్ ఫ్రెడ్(మీరు ఎంచుకున్న వారి పేర్లును మారవచ్చు). సారాంశం మొత్తం ఒక్కసారి పరిదృశ్యం చేసుకోండి, మరియు సారాంశం తో నాటకము యొక్క ఆలోచనలు విస్తరింపచేయండి తద్వారా పిల్లలు తమను తాము బైబిల్ కథలో లీనమైపోయేలా చేయండి. ఆ ఇద్దరి నటులను ఉపయోగించి ప్రతి వారం నాటకాని నిజ జీవితంతో సంబంధం ఉండేలా మరియు వైజ్ విల్లీ మరియు ఫులిష్ ఫ్రెడ్ గురుంచి దెగ్గరిగా తెలుసుకొని ఏడాది మొత్తం మరింత వినోదభరితంగా ఉండేలా చేయండి. చర్చి వద్ద త్వరగా వేసుకొని మరియు వదిలేలా సులభమైన వస్త్రాలు వారి కోసం సృష్టించండి (ఉదాహరణకు ఒక టోపీ మరియు అద్దాలు జత.)

ప్రధాన పాఠం

మీరు పాఠం పరిచయం చేసినా తర్వాత, బైబిల్ కథలోకి కొనసాగండి. దయచేసి బైబిల్ సూచన చూడండి, పూర్తి బైబిల్ కథ కనుగొనేందుకు, ఇది పూర్తిగా చేతి పుస్తకం నందు ముద్రించబడి లేదు. బైబిల్ కథలో తెలుసుకున్న తర్వాత,ప్రధాన పాఠం మీ యొక్క జీవితానికి సంబందించిన విషయాలను తెలియ చేసిందో లేదో నిర్ధారించుకోండి. పాఠం చివరలో, మెమరీ పద్యం చదివి మీ విద్యార్థులతో ప్రార్థన చేయండి

స్టూడెంట్ పుస్తకాలు

స్టూడెంట్ పుస్తకాలు లేదా ప్రతి పాఠపు పేజీ యొక్క అచ్చు కాపీలు అందరికి పంచండి. పజిల్స్ తో కష్టపడుతున్నా విద్యార్థులకు సహాయం చేయండి, ఎందుకంటే,సoడే పాఠశాల పుస్తకాలు కష్టంగా ఉండకూడదు, కానీ సరదాగా ఉండాలి. మీరు కూడా విద్యార్థుల వారి పేజీలలోని విషయాలు అతికించవచ్చు. చిన్న పిల్లల కోసం, వస్తువులు వరి, పత్తి బంతులు , నూడుల్స్, పెయింట్ వంటి వస్తువులా రంగు తో పేజీలను అలంకరించవచ్చు. పాత విద్యార్థుల కోసం, డైరీలు, మెట్రో టిక్కెట్ల పై అతికించుటా, నాణేలు, జేబులో బట్ట పై లేదా ఇతర వస్తువులపై హోంవర్క్ అసైన్మెంట్ గుర్తుండేలా చేయాలి.

హోమ్ వర్క్ అసైన్మెంట్లు

చర్చికి రావడం వలనా లేదా బైబిల్ గుర్తుంచుకోవడం వలనా మనలో ఎవరు విజేతలు అవ్వరు, కానీ ఎప్పటికీ సజీవంగా ఉండటానికి! ఈ నిర్దిష్ట హోంవర్క్ అసైన్మెంట్లతో మీ విద్యార్థులు బైబిల్ తో జీవించి ఉండేలా ప్రోత్సహించండి.

"ఇన్ థా రింగ్" పేజీలో మరింత సమాచారాన్ని చూడండి.

జ్ఞాపకశక్తి పద్యము ఆట

ఈ వారం కార్యక్రమంలో జరిగే ఆటలు జ్ఞాపకశక్తి పద్యములు నేర్చుకోనెలా కలిగి ఉన్నాయి. ప్రతి వారం ఆడటానికి,మేము చూపించిన ఆటను ఎంచుకోండి లేదా మీ విద్యార్థులను వారికి ఇష్టమైన ఆటను ఎంచుకోవడానికి అనుమతించండి. ఆటకు సంబందించిన ఏ పనైనా సమయా అనుసారం సిద్ధం చేయండి

ప్రశ్నలు మరియు జవాబులు (పాత విద్యార్థులకు)

మీ విద్యార్థుల తో చర్చరేకెత్తించే క్రమంలో ప్రతి పాఠం లో మూడు ప్రశ్నలు అందచేయబడింది. కిశోరులా కోసం(వయస్సు 13-15), కానీ చర్చించుటకు మీరు ఇతర వయసుల వారితో కూడా ప్రయత్నించవచ్చు. ఈ ప్రయత్నం మీ విద్యార్థులను ఆలోచించేలా చేస్తుంది. ఈ ప్రయత్నం ఫలించటానికి, మీరు వెంటనే వారికి సమాధానాలు ఇవ్వకూడదు ఇది చాలా ముఖ్యమైనది. వారు ఆ యొక్క విషయం పై భాగా చర్చిస్తే వారు భాగా ఆలోచిస్తున్నారు అని అర్ధం మరియు మీరు ఒక మంచి టీచర్ గా మీ కర్తవ్యం నిర్వహించినట్టు అవుతుంది.ఏదైనా ఒక విషయం గురుంచి వారు నిజమైన శబ్ద వాదన లో మునిగిపోతే నిజంగా మీరు గొప్ప చేసినట్టే! మీ విద్యార్థులు త్వరగా ఒక వాదన పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అయితే, ఇంకో విధంగా వాదనను మలిపి వారిని మళ్ళీ ఆలోచింపచేసి మాట్లాడేలా ప్రయత్నించండి.

మ్యాచ్ కార్డులు

హాజరైన ప్రతి ఒకరికి ఒక కార్డుని బహుమతి ఇవ్వండి, దాని పై ప్రతి వారం మ్యాచ్ ఫైట్ ముద్రించి ఉండాలి. మీ విద్యార్థులని సంవత్సరం మొత్తం హాజరు అయేలా ప్రోత్సహించండి మరియు అన్ని కార్డులని సేకరించండి! ఈ కార్డులు డౌన్లోడ్ మరియు చాలా ఆర్ధికంగా ముద్రించడానికి అందుబాటులో ఉన్నాయి. మెమొరీ గేమ్ ఆడటానికి మరియు అసైన్మెంట్లు జతపరచటానికి మీరు ఈ కార్డులని ఉపయోగించుకోవచ్చు.